TG: దేశంలో అవినీతి రహిత పాలనను BJP అందిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. పార్టీలు చాలా మంది పెడతారని, కానీ ఎలాంటి సిద్ధాంతాలతో పెట్టారనేది ముఖ్యమన్నారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసింది BJPనే అని గుర్తు చేశారు. BJP రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయన్నారు.