VZM: సచివాలయ సేవలు ప్రజలకు పారదర్శకంగా అందాలని సంతకవిటి MRO సుదర్శన రావు సూచించారు. ఇవాళ మామిడిపల్లి స్వర్ణగ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయంలో అందుతున్న సేవలపై ఆరా తీసారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు.