JN: లింగాల గణపురంలో పటేల్ గూడెం రోడ్డు వైపు ఉన్న తాటి చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గోపి, కార్యదర్శి వెంకట మల్లయ్య అన్నారు. లింగాల గణపురంలో వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.