KKD: రాష్ట్రంలో ఏర్పడిన ఇంధన కొరతను అరికట్టాలని శనివారం సామర్లకోట MRO కార్యాలయంలో CPM పట్టణ కమిటీ వినతిపత్రం అందజేసింది. డీజిల్ దొరక్క రైతులు వ్యవసాయ పనులకు ఇబ్బంది పడుతున్నారని పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ తెలిపారు. కొరత లేదని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.