TG: కవిత తనను తాను జయలలితలా, తెలంగాణ అమ్మలా ఊహించుకుంటూ సీఎం కావాలనే ఆశతో పార్టీ పెట్టారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ పార్టీ వల్ల కాంగ్రెస్కు(హస్తానికి) మేలు జరగడం తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. CECలో నమోదైన 6201 పార్టీల్లో ఇది ఒకటి మాత్రమేనని, తనను తాను గొప్పగా ఊహించుకోవడం తప్ప కవిత చేసేదేం లేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.