ADB: నార్నూర్ మండలంలోని దుప్పాపూర్ గ్రామస్థులు ఆదివారం కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి గ్రామంలో మద్యం విక్రయం, సేవించడం పూర్తిగా నిషేధించినట్లు సర్పంచ్ కనక సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విశ్వజిత్, కనక ప్రభాకర్, శ్రీరంగ, జ్ఞ్యానోబా, రమేష్, రామకిషన్, మధుకర్ ఉన్నారు.