తన తదుపరి చిత్రాలపై నటుడు అడివి శేష్ ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు. ‘గూఢచారి 2’ త్వరలో అద్భుతమైన కంటెంట్‌తో రాబోతోందని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే, ‘హిట్ 4’ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని, ప్రస్తుతం దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని తెలిపాడు. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా తాను సిద్ధమని వెల్లడించాడు.