HYD: గ్రేటర్లో తొలి మహిళా పోలీస్ కమిషనర్గా సుమతి (2006 బ్యాచ్ IPS) నియమితులయ్యారు. ప్రస్తుత ఐజీ సుమతిని మల్కాజ్గిరి సీపీగా ప్రభుత్వం నియమించింది. SIB చీఫ్గా పనిచేసిన ఆమె, మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో కీలకపాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి ఏపీలో తొలి మహిళా DSPగా కెరీర్ ప్రారంభించి, HYD నార్త్ జోన్ డీసీపీగా, సీఐడీ విభాగాల్లో చేశారు.