TG: రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం MLC అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. గతేడాది ఆగస్టు 30న గవర్నర్‌కు తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసి పంపిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ గవర్నర్ వారి ఫైల్‌పై సంతకం చేశారు.