HNK: భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామ మహిళా సర్పంచ్ గడ్డం సుజాత తనను దూషించారంటూ నలుగురిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామసభలో మాట్లాడుతున్న సమయంలో రొంటాల ప్రభాకర్, తిరుపతి, రమేశ్, అరవింద్ దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.