KMM: అమ్మాయిలను ప్రేమ, ఉద్యోగాల పేరుతో మోసం చేసి వ్యభిచార కూపంలోకి నెట్టడం హేయమైన నేరమని ప్రజ్వల సంస్థ సమన్వయకర్త సురేష్ కుమార్ అన్నారు. సత్తుపల్లిలో అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యే అంగన్వాడీలు మానవ అక్రమ రవాణాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.