AP: పేదరికం నుంచి పేదలను బయట పడేసేందుకు పీ4 తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పీ4 పథకం గేమ్‌ఛేంజర్. లక్షమంది మార్గదర్శులు.. 10 లక్షల మందిని దత్తత తీసుకున్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత చాలా ముఖ్యం. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని పార్టీలు ఆమోదించాయి. ఇటీవల పెట్టిన బిల్లును విపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయో అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.