GNTR: యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మత్తు, మాదక ద్రవ్యాలను జిల్లాలో పూర్తిగా అరికట్టాలని గుంటూరు కలెక్టర్ సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రవాణా, విక్రయాలపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. యువతలో అవగాహన పెంచి మత్తు బారిన పడకుండా కాపాడాలని సూచించారు.