KNR: సైదాపూర్ మండల కేంద్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి SC కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే 3 వీలర్స్, 2 వీలర్స్, సోలార్, పాడి పశువుల రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నిర్వహించారు. మొత్తం 195 మంది దరఖాస్తుదారులకు గాను 130 మంది హాజరు కాగా, 65 మంది గైర్హాజరయ్యారు. టీజీబీ పోతారం, గొడిశాల, ఆకునూర్, SBI సైదాపూర్ మేనేజర్లు పాల్గొన్నారు.