MDK: చేగుంట మండలం ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్‌ను తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సందర్శించారు. పిల్లల్లో శారీరక దృఢత్వం, మానసిక బలం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ సమగ్ర అభివృద్ధి కోసం క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని ఆర్డీవో సూచించారు.