NDL: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శమని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి అన్నారు. బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని రామాలయంలో ఇవాళ బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మంగారి చిత్రపటానికి బ్రహ్మానంద ఆచారి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేశాడు.