KRNL: నందవరం మండలంలోని నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 96వ ‘స్నేహబంధం’ పుస్తకావిష్కరణ గంగవరంలో సాయి గార్డెన్ సిటీలో ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే డా. మండలి బుద్ధ ప్రసాద్, పలమనేరు ఎమ్మెల్యే యన్. అమరనాథరెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. కవి గద్వాల సోమన్న పుస్తక ప్రదర్శన గావించారు.