AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలపై అరెస్టయిన MLC అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 21న సర్పవరం PSలో నమోదైన కేసులో నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. సాక్షులను ప్రలోభపెట్టి, ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనేది ప్రధాన అభియోగం.