NLG: జిల్లాలో ఈనెల 25 వరకు 1,66,101 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 1,64,808 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం,1294 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉన్నాయన్నారు. 19,689 మంది రైతుల నుంచి 396.82 కోట్ల విలువైన వడ్లను కొన్నామని ఆయన తెలిపారు.