MDK: రామాయంపేట మండలం రోడ్లపై ధాన్యం రాశుల వల్ల ప్రయాణికులు పడే ఇబ్బందులపై ‘హిట్ టీవీ’ కథనానికి స్పందన లభించింది. దీంతో కొంతమంది రైతులు స్పందించి రోడ్లపై కాకుండా కళ్ళాల్లోనే ధాన్యం ఆరబోస్తూ ఆదర్శంగా నిలిచారు. మిగతా రైతులు కూడా ఇదే బాటలో పయనించి భద్రతకు సహకరించాలని కోరుతున్నారు. సాటి మనుషుల ప్రాణాలకు విలువిచ్చిన ఈ రైతుల నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.