KDP: రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, నీటి కొరత నివారణ లక్ష్యంగా ప్రారంభమైన ‘జలధార-జల హారతి’ కార్యక్రమం అమలుపై శనివారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెరువులు, జలాశయాల పునరుద్ధరణతో పాటు ఉపాధి హామీ నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.