ఈ రోజుల్లో యువత విహారయాత్రలకు వెళ్లినప్పుడు ‘డెడ్‌జోనింగ్’ అనే కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. డెడ్‌జోనింగ్ అంటే యాత్రలో ఉన్నప్పుడు ఫోన్లు, ఆఫీస్ ఈమెయిల్స్, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండటం. నిరంతర పని ఒత్తిడి, ఆన్లైన్ కాల్స్ నుండి విముక్తి పొంది, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇలా డిజిటల్ ప్రపంచానికి దూరంగా ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి, కొత్త ఉత్సాహం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.