నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లా కొత్త కలెక్టర్‌గా CH ప్రియాంకను నియమిస్తూ సీఎస్ ఆర్డర్స్ జారీ చేశారు. ప్రతీక్ జైన్ సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రియాంక కలెక్టర్‌గా రేపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.