MNCL: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ శాతాన్ని పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. అధికారులు సమన్వయంతో కృషి చేసి మ్యాపింగ్ ప్రక్రియ విజయవంతం చేయాలని సూచించారు.