AP: YCP చీఫ్ జగన్ దంపతులు ఈ అర్ధరాత్రి బెంగళూర నుంచి లండన్ బయల్దేరారు. 2 వారాల యూరప్, యూకేలో పర్యటన అనంతరం మే 10న తిరిగి భారత్ చేరుకుంటారు. కాగా ఈ నెల 17న ఆయన విదేశీ పర్యటనకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.లక్ష పూచీకత్తు, ఈమెయిల్, ఫోన్ నంబర్ తదితరాలను సమర్పించాలని ఆదేశించింది.