ఆసిఫాబాద్ జిల్లాలో 252-GO ప్రకారం అర్హత గల జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి విడతలో 94 కార్డులను మంజూరు చేశామన్నారు. నిబంధనల మేరకు పారదర్శకంగా కార్డుల పంపిణీ చేపడుతామని పేర్కొన్నారు.