ప్రకాశం: కంభం మండలంలో జరుగుతున్న MGNREGS పనులను ఎంపీడీవో వీరభద్రాచారి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతి, నాణ్యత, కార్మికుల హాజరు తదితర అంశాలను సమీక్షించారు. పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు.