TG: వరంగల్ -ఖమ్మం నేషనల్ హైవేపై రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవడంతో అన్నదాతలు రాస్తారోకోకు దిగారు. మార్కెట్ యార్డులు, రోడ్లపై మొక్కజొన్నలు పేరుకుపోయాయి. కొర్రీలు లేకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులతో కలిసి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధర్నాలో పాల్గొన్నారు.