నంద్యాల జిల్లాలో పోలీస్ శాఖలో సాధారణ బదిలీలలో భాగంగా 73 మంది సివిల్ పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ షారన్ ఆధ్వర్యంలో ఇవాళ బదిలీలు నిర్వహించారు. ఐదు సంవత్సరాలకు పైగా ఒకే స్టేషన్లో పనిచేస్తున్న ASI, HC, PC స్థాయి సిబ్బందిని ఖాళీల ఆధారంగా మార్చారు. సిబ్బంది వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోస్టింగులు ఇచ్చారు.