HYD: సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం లాలాగూడ PSను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో సిబ్బంది పనితీరు, రిసెప్షన్ విభాగం నిర్వహణను సమీక్షించారు. అదేవిధంగా అడ్డగుట్ట, తుకారాం గేట్ ప్రాంతాల్లో నేరాల సరళిపై ఆరా తీసి, లాలాగూడ పోలీస్ స్టేషన్లో అమలవుతున్న సెక్టార్ విధానంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.