WNP: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మనోధైర్యంతో ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.