SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని, 300కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.