SRPT: థాయిలాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ పోటీల్లో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన కీత శ్రీనివాసరావు అద్భుత ప్రతిభ కనబరిచారు. రన్నింగ్, స్విమ్మింగ్, యోగా విభాగాల్లో మొత్తం 3 స్వర్ణ, 1 కాంస్య పతకాలను సాధించి దేశ కీర్తిని దశదిశలా చాటారు. అంతర్జాతీయ వేదికపై విజయదుందుభి మోగించిన శ్రీనివాసరావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.