మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీయడం తన డ్రీమ్ అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పాడు. జాక్సన్ జీవితంలోని మలుపులు, రంగు మార్పు, సంగీత ప్రయాణం ఒక అద్భుతమైన సినిమా కథ అని అన్నాడు. అయితే, ఆ పాత్రను పోషించే సరైన నటుడు దొరకడమే అసలైన సవాలని, అటువంటి నటుడు కనిపిస్తే ఆ సినిమా తీయడం తన కల నిజమవ్వడమేనని పేర్కొన్నాడు. ఎవరు తీసినా ఆ సినిమా చూస్తానని చెప్పాడు.