తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యాహ్నం 12 నుండి 4 వరకు బయటకు రావద్దని హెచ్చరించింది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని.. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.