RR: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. వార్డులోని అండర్ డ్రైనేజీ వ్యవస్థ అడ్డుపడుతుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది ఆధునిక జెట్ మిషన్ సహాయంతో డ్రైనేజీ పైపుల్లోని వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించటంతో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.