కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు గువాహటి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మకు వివిధ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో రిణికి భూయాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ ఖేరాపై గువాహటిలో కేసు నమోదైంది.