JGL: పెగడపల్లి మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 28న మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ తెలిపారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ వెంట మూడు సెట్ల జిరాక్స్ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.