GDWL: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం టీయూసీఐ (TUCI) జిల్లా అధ్యక్షుడు సి. హనుమంతు 140వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన నాలుగు లేబర్ కోడ్స్ పని గంటల పెంపునకు, సమ్మె హక్కుల హరణానికి మరియు శ్రమ దోపిడీకి దారితీస్తున్నాయని మండిపడ్డారు. కోడ్స్‌ను రద్దు చేసే వరకు ఎర్రజెండా నీడన పోరాడాలని పిలుపునిచ్చారు.