TG: ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ‘కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా. కేసీఆర్ను మరమనిషి అంటూ కవిత మాట్లాడటం బాధాకరం. సంక్షేమం అందించిన వ్యక్తి మర మనిషి అవుతారా. కేంద్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ను ప్రశ్నించాలి. కానీ, ప్రతిపక్షాన్ని తిట్టడం ఏంటి? ఎవరికోసం పార్టీ పెట్టారో అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు.