ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న అన్ని కేడర్ల టీచర్ల తుది సీనియారిటీ జాబితాలు విడుదల చేసినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. మార్చి 1, 15 తేదీల్లో రెండు విడతలుగా విడుదల చేసిన ప్రాథమిక జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతుండడంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఈ జాబితా మేరకే జరుగుతుందన్నారు.