VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ భోగాపురం, పూసపాటిరేగ పోలీసు స్టేషన్లను గురువారం సందర్శించి, స్టేషను పరిసరాలను, సీడీ ఫైల్స్‌ను పరిశీలించారు. స్టేషనుకు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషను పరిధిలో బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని కోరారు. ఆయన వెంట పలువురు సీఐలు పాల్గొన్నారు.