మహబూబ్నగర్ జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా యువజన క్రీడల అధికారి రాజశేఖర్ రెడ్డి మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీయడంలో అలాగే క్రీడాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.