MDK: జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ (STU) భవన్లో జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పీఆర్సీ అమలు, 5 డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు కోరుతూ మే 5న నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు.