NZB: గోవును జాతీయ గోమాతగా ప్రకటించాలని కోరుతూ కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జంబి హనుమాన్ దేవాలయంలో కరపత్రాలు పంపిణీ చేశారు. గో సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ఇవాళ సంతకాల సేకరణ చేపట్టారు. ఏప్రిల్ 27న తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్య క్రమంలో రమణయ్య, రాజశేఖర్, రామస్వామి, నరేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.