NLG: ప్రతి నెలా చివరి శనివారం వృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణిని వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి ఓ ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల కారణంగా దీనిని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ప్రజావణి నిర్వహణ తేదీని ప్రకటించే వరకు వృద్ధులు, దివ్యాంగులు ప్రజావణికి రావద్దని, ఎండలో బయటకు రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని కోరారు.