KMM: ఉమ్మడి జిల్లాలోని 101 పీఏసీఎస్ పాలకమండళ్లను నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. మే నెలాఖరులోపు ప్రక్రియ ముగిసే అవకాశం ఉండటంతో, పదవుల కోసం ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏడాదిగా ఇంఛార్జ్ పాలనలో ఉన్న ఈ సంఘాలకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకంలో ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకం కానున్నాయి.