నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న 111వ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా చారిత్రక నేపథ్యం అనుకున్నా, ఇప్పుడు బాలయ్య పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్లో కనిపించబోతున్నారట. ‘వీరసింహా రెడ్డి’ తర్వాత వస్తున్న ఈ మూవీలో ఆయన పాత్రకు డార్క్ షేడ్స్ ఉండటం విశేషం. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులకు పక్కా మాస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.