డైరెక్టర్ బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలతో మూవీలు చేస్తారని ప్రచారం సాగినా, ఇప్పటికీ అధికారిక స్పష్టత లేదు. తాజా సమాచారం ప్రకారం, ఆయన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో ‘జాట్ 2’ లేదా మరో భారీ యాక్షన్ చిత్రం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.