వికారాబాద్ జిల్లాలో నిర్వహించే మే డే వేడుకల్లో ప్రదానం చేసే అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ కార్మిక కమిషనర్ వాల్య తెలిపారు. ఈ నెల 27 లోగా సమర్పించాలని చెప్పారు. ఉత్తమమైన వైద్యుడు, ప్రిన్సిపల్, శిక్షకుడు, పరిశ్రమ విభాగంలో, ప్రత్యేక విభాగంలో ఉత్తమమైన సేవలను అందించినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.